నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు (మంగళవారం) హైదరాబాద్ రానున్నారు. మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. గచ్చిబౌలిలో జరగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సైబరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. గచ్చిబౌలి నుండి లింగంపల్లి రోడ్డు వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచించారు. రాష్ట్రపతి పర్యటనకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.