ఏళ్లుగా శ్రమ దోపిడికి గురవుతున్న సమగ్ర శిక్ష సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి.. మాట తప్పానని… మాట కోసం తలనైనా నరుకుంటా కానీ మాట తప్పద్దని ఇప్పుడు మాట్లాడాలి సమగ్ర శిక్షా ఉద్యోగుల కు హనుమకొండాలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ మాధవ్ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా దీక్షా శిబిరం నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ నోటికి గుడ్డలు కట్టుకొని మౌన దీక్ష చేపట్టారు.
డిఎస్పీ పార్టీ నాయకుల మద్దతు..
రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఐదు రోజులుగా చేస్తున్నటువంటి వారి ధర్నా కార్యక్రమాలకు ధర్మసమాజ్ పార్టీ(డిఎస్పీ ) జిల్లా నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సంద్భంగా ఈ డిఎస్పీ జిల్లా అద్యక్షులు గణేష్ మహరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు హన్మకొండ లో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని, మహిళల ఉద్యులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగులకు 10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గా 25 లక్షలు ఇవ్వాలని ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన డిమండ్స్ ని ప్రభుత్వం పరిగణనలోకి తీస్కొని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల డిమాండ్స్ ప్రభుత్వం నెరవేర్చే వరకు వారి పోరాటానికి మద్దతుగా ఉంటామని గణేష్ మహరాజ్ అన్నారు. కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్, జిల్లా డిఎస్పీ నాయకులు వెంకటేష్, రాజేశ్వర్, సంతోష్, గంగన్న, ఓమన్న సంతోష్, సాయి,వినోద్ లు పాల్గొన్నారు.