నీట్, నెట్ పరీక్షలలో జరిగిన కుంభకోణంపై విచారణ చేపట్టాలి..

నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్ : దేశవ్యాప్తంగా నిర్వహించిన  నీట్,నెట్ పరీక్షలల్లో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు చేత  విచారణ చేపట్టి, అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (పిడిఎస్ఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం పిడిఎస్ఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులోకి వచ్చిన తర్వాత అక్రమార్కుల చేతిలో విద్యను పెట్టి విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసే చర్యలకు పూనుకున్నారని దీనిలో భాగంగానే, విద్యను కాషాయకరణ,ప్రైవేటీకరణ, కేంద్రీకరించి అంగట్లో సరుకు లాగా కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారు.నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ) అసమర్థత మూలంగా 24 లక్షల మంది నీట్ విద్యార్థులు,11 లక్షల నెట్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న మోడీ ప్రభుత్వం సిబిఐ విచారణ పేరుతో కాలం గడిపి నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు.దీనికి పూర్తి బాధ్యత  మోడీ వహించాలి. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి.విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఎన్ టి ఏ ను రద్దుచేసి, లక్షలాది మంది విద్యార్థుల కోరిక మేరకు తక్షణమే పరీక్షలు నిర్వహించి, వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎస్ నవీన్, ఉదయ్, హరీశ్, వెంకటేష్, బన్ని, లోకేష్ లు పాల్గోన్నారు.
Spread the love