మంత్రి సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ.. అంగన్వాడీలు వినూత్న నిరసన

నవతెలంగాణ- తాడ్వాయి
సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు చేపట్టిన సమ్మె ఉధృత రూపం దాల్సుతుంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఈనెల 11 నుంచి అంగన్వాడి టీచర్లు హెల్పర్లు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు 13వ రోజు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మండల కేంద్రంలో 163 జాతీయ రహదారిపై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మరిచిపోయారని, దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కురేందల సమ్మక్క మాట్లాడుతూ గతంలో సీఎం కేసీఆర్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. అంగన్వాడి ఉద్యోగులకు 26 వేల వేతనం ఇవ్వడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షల చొప్పున ఇవ్వాలని గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాగా ఈ సమ్మెకు శనివారం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దుగ్గీ చిరంజీవి, నాయకులు దాసరి కృష్ణులు సిపిఎం తరపున మద్దతు తెలిపారు
Spread the love