అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలి

– అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు సమ్మక్క
– మండల కేంద్రంలో వినూత్న నిరసన
నవతెలంగాణ- తాడ్వాయి
అంగన్వాడి టీచర్లను పర్మినెంట్ చేయాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు కురెందుల సమ్మక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 11 నుండి ప్రారంభమైన అంగన్వాడీల నిరవధిక సమ్మె ఆదివారం ఏడవ రోజుకు చేరింది. ఆదివారం నాడు మండలంలోని అంగన్వాడి టీచర్లు వినూత్నంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు కురెందుల సమ్మక్క మాట్లాడుతూ అంగన్వాడీలను వెంటనే పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అందించాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ పెన్షన్ పెంచాలని, తమ నాయకులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
Spread the love