గూర్‌గావ్: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కొత్తగా తన మూడో విద్యుత్ కారును ఆవిష్కరించనుంది. సెప్టెంబర్ 11న విండ్సర్ ఈవీని విడుదల చేయనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ వాహనాన్ని 50.6 కిలోవాట్ల ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్‌తో తీసుకొస్తోంది. సింగింగ్ చార్జింగ్‌తో 460 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కేవలం 30 నిమిషాల్లోనే 30-100 శాతం చార్జింగ్ అవుతుందని వెల్లడించాయి.