- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని సిద్దుల గుట్ట అయ్యప్ప ఆలయంలో ప్రతి నెల మొదటి బుధవారంలో భాగంగా ప్రత్యేక పూజ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత డబ్బులతో అయ్యప్ప గుడి నిర్మించిన అయ్యప్ప పౌండేషన్ చైర్మన్, సీనియర్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గురు స్వామి నాగేష్ శర్మ ప్రత్యేక పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -



