Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైద్యవృత్తి పవిత్రమైనది: డా.మానస

వైద్యవృత్తి పవిత్రమైనది: డా.మానస

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్  
ప్రజల ప్రాణాలను కాపాడుతూ నిస్వార్థపు సేవలు చేస్తున్న వైద్యులందరికీ మండలంలోని గోవింద్ పెట్ పి.హెచ్.సి వైద్యాధికారిని మానస శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ.. వృత్తి అనేది దేనికి అదే సాటి అని అభిప్రాయపడ్డారు. అయితే వైద్య వృత్తిలో వైద్యునికి ప్రాణం పోసే శక్తి ఉందని, ఇది ప్రతి వైద్యునికి ఎంతో గర్వకారణం అన్నారు. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తిని నిర్వహించే వైద్యులు ఎల్లవేళలా రోగులకు అందుబాటులో ఉంటూ జీవనోపాధి కోసం కాకుండా ప్రజల సేవ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. సమాజంలో అంతటి గొప్ప స్థానం ఉన్న వైద్యులు సేవాభావంతో పనిచేస్తూ ఎంతో పేరును సంపాదించిన వారు ఉన్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఫార్మసీ, నర్సింగ్ తదితరులు వైద్యాధికారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్.సి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -