Monday, June 8, 2026
E-PAPER
Homeజాతీయంమ‌రోసారి మ‌మ‌తా బెన‌ర్జీకి భారీ షాక్

మ‌రోసారి మ‌మ‌తా బెన‌ర్జీకి భారీ షాక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మ‌రోసారి అంత‌ర్గ‌త విభేదాల కారణంగా టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్లమెంటు ఎగువ సభ సభ్యత్వానికి మరియు టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఎదుర్కొన్న ఘోర పరాజయంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ సాగించిన 15 ఏళ్ల అరాచక పాలన ఫలితమే ఈ ఎన్నికల తీర్పు అని ఆయన అభివర్ణించారు. ఈ పాలనలో విపరీతమైన అవినీతి, మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకోవడంతో పాటు ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు, శాంతిభద్రతలు, ఉపాధి వంటి రంగాలలో ఘోర వైఫల్యం నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఘోర వైఫల్యాలతో కూడిన తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల అరాచక పాలనకు ప్ర‌జ‌లు చరమగీతం పాడారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -