నందికొండలో ఎనీటైం ఖాళీ

– గత కొన్ని రోజులుగా పనిచేయని ఏటీఎంలు
– డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఇక్కట్లు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ – నాగార్జునసాగర్
నందికొండలో ఎస్బిఐ ఏటీఎంలు చాలా రోజుల నుండి పనిచేయని దుస్థితి.ప్రపంచ పర్యాటక కేంద్రమైనా నాగార్జునసాగర్ లో నిత్యం పర్యాటకులు వస్తుంటారు వారి అవసరాలకు  ఏటీఎంలు ఆశ్రయిస్తే డబ్బులు విత్ డ్రా కాక,ఖాతాదారులకు సైతం డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్‌కు వచ్చిన ఫలితం లేకుండా పోతుంది. సాగర్లో ఉన్న రెండు ఎస్బీఐ ఏటీఎంలు గత కొన్ని రోజులుగా పనిచేయకపోవడంతో బ్యాంకు ఖాతాదారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏటీఎం సాకేతిక లోపమో. యాజమాన్య లోపామో తెలియడంలేదు. ఎంతో అవసరమై డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంకు వస్తే అందులో డబ్బులు లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని, ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా పేరొందిన స్టేట్‌బ్యాంక్‌ ఏటీఎంలో డబ్బులు లేకపోవడం,మరొక ఏటీఎం ఎప్పుడు మూసివుండటం విశేషం. ఇదే విషయంపై ఆ బ్యాంక్‌ మేనేజర్‌ను కలిసినా ఫలితం కనిపించలేదని ఆ బ్యాంక్‌ ఖాతాదారులు స్పష్టం చేస్తున్నారు.ఈ క్రమంలో ప్రజలు తమ అవసరాలు తీర్చుకునేందుకు ఇక్కట్లు పడుతుండగా తమ ఖాతాలో డబ్బులున్నా అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడిప్పుడే మారుమూల గ్రామాలు,తాండలలోని గిరిజనులు కూడా ఏటీఎంల వాడకం ప్రారంభించగా, ప్రస్తుతం ఏటీఎంలో డబ్బులు లేకపోవడంతో వారు తమ అవసరాల నిమిత్తం డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుస్తోంది. ఇదే విషయంపై ఆయా బ్యాంకుల యజమానులను కలిసినా ఫలితం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి, డబ్బులు ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.దీంతో అత్యవసర డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం ల వద్దకు పలువురు చేరుకుంటున్నప్పటికీ తలుపులు మూసి ఉండడం తో నిరాశగా ఖాతాదారులు వేనుదిరగాలిసి.బ్యాంక్ ఉన్నతాధికారులు సత్వరం స్పందించి ఎస్బీఐ ఏటీఎం ఎల్లప్పుడు ఖాతాదారులకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
నిత్యం మూసివుంటున్న జెన్కో ఎస్బిఐ ఏటీఎం: నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని జెన్కో సర్కిల్ కార్యాలయం వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం గత కొన్ని రోజులుగా పనిచేయకపోవడం,నిత్యం మూసివుంచడం వలన బ్యాంకు ఖాతాదారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.గతంలోనూ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన ఏటీఎంను తిరిగి బ్యాంకు అధికారులు పునఃప్రారంభించిన ఫలితం లేకుండాపోయిందని వినియోగదారులు,స్థానికులు నైరాశ్యానికి గురౌతున్నారు., జెన్కో కార్యాలయం వద్ద ఉన్న ఎస్బిఐ ఎటిఎం పైనుండి హై టెన్షన్ తీగలు ఉండడంతో నిత్యం మరమ్మతులకు గురవుతుందని ఏటీఎం ను అక్కడినుండి బైపాస్ రోడ్డు కు మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Spread the love