నవతెలంగాణ – వనపర్తి : 2026-27 విద్యా సంవత్సరానికి ఎస్.సి. విద్యార్థులు 31-05-2026 నాటికి అయిదు సంవత్సరములు నిండి ఆరు సంవత్సరములలోపు వయస్సు ఉన్న ఆసక్తి కలిగిన ఎస్. సి. విద్యార్థులు బెస్ట్ అవలెబుల్ స్కూల్స్ డే స్కాలర్స్ ఒకటవ తరగతిలో ప్రవేశానికి, బెస్ట్ అవలెబుల్ స్కూల్స్ రెసిడెన్సియల్లో ఐదవ తరగతి ప్రవేశానికి దరఖాస్తులను అన్ని ద్రువపత్రములతో మే 15 నుండి జూన్ 6వ తేదీ సాయంత్రము 5.00 గంటలలోగా కార్యాలయపు పనిదినములలో కార్యాలయంలో షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వనపర్తి జిల్లా వాసులై ఉండాలన్నారు. మీ-సేవ నుండి పొందిన కులము, ఆధాయముతో పాటుగా స్థానికత, జనన దృవీకరణ ద్రువపత్రములు ఆదార్ కార్డుతో పాటుగా పోటో జతచేయాలని కోరారు. 5వ తరగతిలో ప్రవేశము పొందేవారు నాల్గవ తరగతి పాఠశాల బోనఫైడ్ జతచేయాలని సూచించారు. గ్రామీణ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయము రూ.1,50,000, పట్టణ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయము 2,00,000 వారు ఆర్హులని తెలిపారు. ఒక కుటుంబము నుండి ఒకరికె అవకాశము కల్పిస్తామని తెలిపారు. గతములో ఈ పధకము క్రింద ప్రవేశము పొందిన వారు అనర్హులన్నారు. గతములో ఈ పథకములో ప్రవేశము పొందలేదని, ఒకవేళ ప్రవేశం పొందినట్లు రుజువు ఐనచో ప్రభుత్వం విధించే శిక్షను స్వీకరించగలమని హామీ పత్రము జతపరచాలని సూచించారు. ఇతర వివరాలకు మొబైల్ నం.7288082974 లో సంప్రదించి సమాచారము పొందాలని పేర్కొన్నారు.
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు దరఖాస్తుల ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



