Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల ఇళ్ల స్థలాలు కాపాడాలని కలెక్టర్ కు వినతి

పేదల ఇళ్ల స్థలాలు కాపాడాలని కలెక్టర్ కు వినతి

- Advertisement -

నవతెలంగాణ – ఊరుకొండ : నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొంతమంది తమ స్వార్థం కోసం అక్రమంగా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని విక్రయిస్తున్నారని.. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గుడిగానిపల్లి రాజుమాదిగ జిల్లా కలెక్టర్ కు విన్నపించారు. గురువారం ఊరుకొండ మండల పరిధిలోని గుడిగాని పల్లి గ్రామ పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రాజు మాదిగ ఇళ్ల స్థలాల గురించి వివరించారు. గుడిగానిపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 297లో 11-18 గుంటల భూమి కలదని, అందులో 8-11గుంటలు అప్పటి ప్రభుత్వం 1983-84లో నిరుపేదలైన ఎస్సీ మరియు బీసీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఇట్టి ఇళ్ల స్థలం ఒక ప్లాట్ 225 గజాలు కలదు. అయితే ఇళ్ల లబ్ధిదారులు కొందరు ఇల్లు కట్టుకున్నారు. ఇంకా 50 ఇళ్ల స్థలాల లబ్ధిదారుల స్థలం ఖాళీగా ఉన్నది. ఇట్టి ఖాళీ స్థలాన్ని అప్పుడు ప్రభుత్వనికి 8-11గుంటల భూమిని ఇచ్చిన రెడ్డి కులస్తులు మేము ఇంత భూమి ప్రభుత్వనికి ఇవ్వలేదు అని అక్రమంగా దొంగ పట్టాలు చేయించుకుని విక్రహిస్తున్నారని తెలిపారు. కోర్ట్ జడ్జిమెంట్ ఫైల్ చూయించిన.. ఇట్టి విషయాన్నీ పలుమార్లు తహసిల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ లకు విన్నవించుకున్న న్యాయం జరుగలేదని వాపోయారు.

ఇప్పటికైనా నూతన కలెక్టర్ గా చోరువ చూపి ఎస్సీ, బీసీ కులాల ఇళ్ల స్థలాలని కాపాడాలని విజ్ఞప్తి చేసిన తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి తహసిల్దార్ యూసుఫ్ అలీని పీలిచి సమస్య పరిస్కారం చేయాలనీ.. అందుకు క్షేత్రస్థాయిలో రిపోర్ట్ తయారు చేయాలనీ  ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గుడిగానిపల్లి రాజుమాదిగ, జోగు శ్రీపతి, తుప్పల వెంకటేష్, పిల్లెల్ల రమేష్, ప్రదీప్ గౌడ్, ఎర్రశయని బంగారు, పెద్దాపుల్లని రాజు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -