ములుగు, భూపాలపల్లి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ టి. హరిసింగ్
నవతెలంగాణ – తాడ్వాయి : ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల మినీ గురుకులాల నందు 2025- 26 అకాడమిక్ ఇయర్ కు అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నట్లు భూపాలపల్లి, ములుగు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ టి.హరి సింగ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాలోని జాకారం స్కూల్ నందు ఒకటవ తరగతి నందు 30 సీట్లు, రెండవ తరగతిలో 12, మూడో తరగతిలో 3 సీట్లు ఉన్నాయని తెలిపారు. తాడ్వాయి మండలంలో బంధాల గ్రామపంచాయతీ పరిధిలో గల పోచాపూర్ మినీ గురుకులంలో ఒకటవ తరగతిలో 30 సీట్లు, రెండవ తరగతిలో ఐదు సీట్లు, నాలుగవ తరగతిలో ఐదు సీట్లు ఉన్నట్లు తెలిపారు. వాజేడు మండలంలోని మినీ గురుకులం పాఠశాలలో ఒకటవ తరగతిలో 30 సీట్లు, రెండవ తరగతిలో 15 సీట్లు, నాలుగో తరగతిలో ఒక సీటు ఉందని తెలిపారు. అడ్మిషన్లు ఈ నెల 29 మే, 2025 నుండి, వచ్చేనెల జూన్ 6, 2025 తారీకు వరకు జరుగుతుందని తెలిపారు. కావున పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం ఆధార్ కార్డు, ఫోటో, రేషన్ కార్డు పట్టుకొని రావాలని కోరారు. ఆదివాసి గిరిజన విద్యార్థినీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మినీ గురుకులాల్లో దరఖాస్తులకు ఆహ్వానం ..
- Advertisement -
- Advertisement -



