బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడి నియమాకం

నవతెలంగాణ-బెజ్జంకి 
కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన ఇస్కిల్ల పర్శరాములు నియామకమైనట్టు మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,కాంగ్రెస్ నాయకులతో కలిసి రత్నాకర్ రెడ్డి పర్శరాములుకు నియామకపత్రం అందజేశారు.తన నియామకానికి సహకరించిన మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పఫ్శరాములు కృతజ్ఞతలు తెలిపారు.అంతకుముందు పార్టీ కార్యాలయం వద్ద రత్నాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఉప సర్పంచ్ బండి వేణు యాదవ్,నాయకులు లింగాల శ్రీనివాస్,మాంకాల ప్రవీన్,గూడెల్లి శ్రీకాంత్,బోనగం రాజేశం,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య తదితరులు హజరయ్యారు.
Spread the love