ఊరికి సేవ చేయడం అభినందనీయం: ప్రభాకర్

నవతెలంగాణ- వలిగొండ రూరల్
పుట్టి పెరిగిన సొంత ఊరు కోసం జిట్టబోయిన మల్లేశం పద్మ దంపతుల సౌజన్యంతో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం జిట్టబోయిన మల్లేశం పద్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు కబడ్డీ క్రీడాకారులకు టీ షర్ట్ లు, లైబ్రరీకి 118 బుక్కులు పంపిణీ చేశారు.అలాగే అంబటి గంగమ్మ జ్ఞాపకార్థం10వ వర్ధంతి సందర్భంగా ఆమె కుమారులు అంబడి సత్తయ్య,శ్రీను,గిరి సౌజన్యంతో పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం మల్లేశం మాట్లాడుతూ జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా పుట్టిన ఊరు,కన్నతల్లిని మరచిపోకూడదనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోడ లక్ష్మమ్మ బాలయ్య ఎంపీటీసీ సామ రాంరెడ్డి ఉప సర్పంచ్ కట్ట సత్తయ్య కో ఆప్షన్ సభ్యులు ఎస్.కె రసూల్ పులిపలుపుల రాములు గౌడ్ ఎస్ఎంసి చైర్మన్ బత్తుల గంగారాం   జిట్టబోయిన అశోక్.హరీష్. కుమార్.కృష్ణకాంత్.అంబటి అంజయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love