– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ
నవతెలంగాణ-డిచ్‌పల్లి
ప్రజలందరూ ఆరోగ్యమేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ అన్నారు. శనివారం సామాజిక ఆరోగ్య కేంద్రం డిచ్‌పల్లిలో జరుగుతున్న ఆరోగ్యమేల కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ సందర్శించారు. ఈ ఆరోగ్య మేళాలు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాలు కింద ప్రతినెల రెండవ శనివారం ప్రత్యేక వైద్య నిపుణులచే జరుపుతున్నమని, ప్రజలందరూ ఈ ఆరోగ్యమేళాను ఉపయోగించు కోవలని కోరారు. కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ సుష్మ, దంత వైద్య నిపుణురాలు సరిత గ్రేస్‌లు రోగులకు శిక్షణ అందించారు. స్త్రీ వైద్య నిపుణురాలు స్త్రీలకు సంబంధించిన గైనకాలజీ సమస్యలకు స్కానింగ్ చేసి చికిత్స అందించారు. ఆరోగ్యమేళాలో అందుతున్న సదుపాయాలను రోగులను అడిగి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాగరాజ్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.