నవ తెలంగాణ -మహబూబ్ నగర్
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ అన్నారు. ఆదివారం జిల్లాలో రేపు జరుగనున్న పోలింగ్ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఉన్న 3 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సెక్టార్ అధికారులు, పోలీస్ రూట్ ముబైల్ అధికారులు, ఆర్ముడ్ అధికారులతో పోలింగ్ అధికారులను పోలింగ్ పరికరాలను పోలింగ్ లొకేషన్లకు పటిష్టమైన భద్రతతో తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రలైన మహబూబ్ నగర్ నియోజకవర్గం బార్సు జూనియర్ కాలేజ్, దేవరకద్ర నియోజకవర్గం గర్ల్స్ జూనియర్ కాలేజ్ నందు మరియు జడ్చర్ల నియోజకవర్గం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డిగ్రీ కళాశాల జడ్చర్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను, ఎస్పీ గారు సందర్శించారు. ఈ సందర్బంగా పోలీసు అధికారులకు సిబ్బందికి పోలింగ్ బందోబస్త్, భద్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగకు పటిష్టమైన భద్రత బందోబసు ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా 922 సివిల్ %డ% ఏ ఆర్ ఫోర్స్ జిల్లా 200 – కర్ణాటక గ్రేహౌండ్స్, 200 మంది సిఐడి డిపార్ట్మెంట్, 270 మంది కేంద్ర బలగాలు, 150, 270 మంది కేంద్ర బలగాలు మొత్తం…1962 మందినీ పోలింగ్ బందోబస్త్ కు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిధిలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచానీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఓటర్లను ప్రభావితం చేసే ప్రజలను ప్రలోభాలకు గురి చేసే డబ్బులు, వస్తువులు వంచకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ఇడుగుతుందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు 144 చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నియమ నిబంధనలు ఉల్లంఘించి, ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించిన, అల్లర్లకు, గొడవలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు.