మృగశిర కార్తీ ముగిసిన శనివారంతో ఆరుద్ర కార్తీ మొదలైంది.తొలకరి జల్లులు పడిన తరువాత ఆరుద్ర కార్తిలో ఆరుద్ర పురుగులు దర్శనమిస్తుంటాయి. ఈ పురుగులు దుక్కులు దున్నిన చెలకల్లో పచ్చిక బయళ్లతో కనువిందు చేస్తుంటాయి. ఆరుద్ర పురుగులు దర్శనమిచ్చాయంటే వర్షాలు బాగా కురుస్తాయని రైతుల నమ్మకం.పంట పొలాల్లో క్రిమిసంహారక మందుల వాడకం పెరిగిపోవడంతో భూముల్లో విషవాయువులు వీహెరిపోయి పంటలకు మేలు చేసే పురుగులు క్రమంగా అంతరించి పోతున్నాయి. అందులో ఆరుద్ర పురుగులు శనివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ప్రత్యక్షం కావడంతో రైతులు సంబర పడుతున్నారు.