నవతెలంగాణ – ఐనవోలు : రాబోయే సార్వత్రిక ఎన్నికలను దూరష్టిలో పెట్టుకొని అదిష్టానం అదేశానుసారం ప్రచారంలో భాగంగా ఐనవోలు మండలంలోని పెరుమాండ్ల గూడెం గ్రామంలో బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ భారీ మెజార్టీ గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని చేపట్టిన బిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గ్రామ ఇంచార్జ్ గూబ అరుణ్ కుమార్, మజ్జిగా జైపాల్, గ్రామ సర్పంచ్ పిడుగు రజిత, గ్రామ పార్టీ అధ్యక్షుడు తక్కలపెల్లి పాపారావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దుప్పెల్లి కొమురయ్య, బూత్ లెవెల్ ఇంచార్జ్ కావటి స్వామి, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.