ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి…

– వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ రాజేశంకు వినతి పత్రం అందజేత…
– ఆశ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం కోఠి లోని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కార్యాలయంలో ఆశ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి, రాష్ట్ర కోశాధికారి పి గంగమని వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ రాజేశం ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ…ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000/-లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి. ప్రమోషన్, ఇన్సూరెన్స్, పిఎఫ్, ఈఎస్ఐ ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2023 సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశామన్నారు. సమ్మె సందర్భంగా (09-10-2023న) హైదరాబాద్. కోఠి కమీషనర్ ఆఫీస్ ముందు జరిగిన ధర్నా సందర్భంగా ఆనాటి ఉన్నతాధికారులు అశా యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీతో జరిపిన చర్చలు జరిపి  కొన్ని నిర్దిష్టమైన హామీలను ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామన్నారు.
     గత ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలతో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో అలా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశాము అని అన్నారు.సమస్యల పరిష్కారం కోసం కోఠి వద్ద జరిగిన ధర్నాల సందర్భంగా ఆశా వర్కర్లకు 2024 ఫిబ్రవరి 9న, జూలై 30న, డిసెంబర్ 10న రూ.50 లక్షల ఇస్ఫూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చులు రూ.50 వేలు ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు ఇస్తామని, టార్గెట్స్ రద్దు చేస్తామని, ప్రమోషన్స్ కల్పిస్తామని, స్పూటం డబ్బాలు మోయటం రద్దు చేస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు అని గుర్తు చేశారు. ఇతర సమస్యల పైన ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేశారు అని అన్నారు.
          పై హామీల్లో స్పూటం డబ్బాలు మోయటం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అని గుర్తు చేశారు. ఇతర సమస్యలు నేటికీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి నేటి వరకు ఆశా వర్కర్లు అనేక విజ్ఞప్తులు చేశారు. నిరంతరం అనేక ఆందోళనా-పోరాటాలు నిర్వహిస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్రమైన ఆందోళనకు ఆశా వర్కర్లు గురవుతున్నారు అని అన్నారు. ఈ అంశాలను పరిశీలించి, పరిష్కారం చేయాలని జాయింట్ డైరెక్టర్ రాజేశం ను కోరామని తెలిపారు.
         ఏఎన్ఎం, జిఎన్ఎమ్ ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు ఏఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి అన్నారు. వెయిటేజీ మార్కులు వెంటనే నిర్ణయించాలి అన్నారు. గత 15 రోజుల సమ్మె హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు, 2024 ఫిబ్రవరి 90 జూలై 30న డిసెంబర్ 10న ఆరోగ్య శాఖ కమీషనర్ గారు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి నన్ను డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్ఫూరెన్స్ రూ. 50 లక్షలు చెల్లిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి అన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు మట్టి ఖర్చులు రూ.50 వేలు చెల్లిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి ప్రభుత్వాన్ని కోరారు. డిసెంబర్ 10న ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆదివారం మరియు పండుగలకు సెలవులు నిర్ణయిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి అన్నారు. డిసెంబర్. 10న ఇచ్చిన హామీ ప్రకారం ఏఎన్ సి , పిఎన్ సి తదితర టార్గెట్స్ ను రద్దు చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి అన్నారు.
            రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలి. ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలి అన్నారు.ఆశాలకు ప్రతి సంవత్సరం 20 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరారు. 6 నెలలు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలి అన్నారు. గత ప్రభుత్వ హామీ ప్రకారం ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి అన్నారు.ఆశాలకు పూనమ్ క్లాత్ తో కూడిన క్వాలిటీ యూనిఫామ్, ఎండాకాలంలో కాటన్ యూనిఫామ్ ఇవ్వాలి అన్నారు.  ఆశాలు చేస్తున్న పారితోషికం లేని పనులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి అన్నారు.
        2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పిఆర్సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు.2022, 2023, 2024 సం॥చి లెప్రసీ సర్వే పెండింగ్ డబ్బులు పెండింగ్ జిల్లాలకు వెంటనే చెల్లించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. 2024 మార్చి 3-5 వరకు 3 రోజుల పల్స్ పోలియో డబ్బులు చెల్లించాలన్నారు.ఇప్పటివరకు లేని ఆసుపత్రుల్లో వెంటనే ఆశాలకు రెస్ట్ రూములు ఏర్పాటు చేయాలన్నారు. ఆశాలకు రక్షణ కల్పించాలి. డ్యూటీలు వేసే సందర్భంగా వెహికల్తో పాటు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాని కోరారు. ఈ సమస్యలన్నిటిని జాయింట్ డైరెక్టర్ కు వివరించామని తెలిపారు.
Spread the love