వరల్డ్‌ పొయిట్రీ కేఫ్‌లో అశోక్‌ చక్రవర్తి కవిత

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పర్యావరణ పరిరక్షణపై డాక్టర్‌ టీ అశోక్‌ చక్రవర్తి రాసిన ఆంగ్ల కవిత కెనడాకు చెందిన రేడియో స్టేషన్‌ వరల్డ్‌ పొయిట్రీ కేఫ్‌లో ప్రసారం అయ్యింది. యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ (యూఎన్‌ఓ) ఏటా జూన్‌ 5న పర్యావరణ పరిరక్షణ దినం నిర్వహిస్తుంది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తుంది. దానిలో భాగంగా ప్లాస్టిక్‌ కాలుష్యంపై డాక్టర్‌ అశోక్‌ చక్రవర్తి ఆంగ్లంలో కవిత రాసారు. ఈనెల 8వ తేదీ కెనడా రేడియోలో 180 దేశాల్లో ఈ కవితను ప్రసారం చేసింది. ఈ సందర్భంగా డాక్టర్‌ టీ అశోక్‌ చక్రవర్తి మాట్లాడుతూ 30 ఏండ్లుగా తాను ఆంగ్ల కవిత్వం రాస్తున్నట్టు తెలిపారు. ప్రపంచశాంతి, పర్యావరణంపై ప్రధానంగా కవితలు రాసాననీ, 90 దేశాల్లోని పలు ప్రసారమాధ్యమాల్లో ఇవి ప్రచురితమయ్యాయని వివరించారు. ఈ సందర్భంగా అనేక ప్రసంసలు, అవార్డులు, బిరుదులు అందుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. పలు దేశాల అధ్యక్షులు కూడా తన కవితలను ప్రసంసించారని తెలిపారు.

Spread the love