టీఎస్ ఈసెట్ లో ఆశ్రిత ఉత్తమ ర్యాంక్

నవతెలంగాణ – భిక్కనూర్
టీఎస్ ఈ సెట్ ఫలితాలలో పట్టణ కేంద్రానికి చెందిన ఆశ్రిత రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంకు సాధించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు దయానంద్ కిరణ్మయి దంపతుల కూతురు ఆశ్రిత హైదరాబాద్ లోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ చదివేందుకు ఈసెట్ ప్రవేశ పరీక్ష రాయగా అందులో రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంకు సాధించింది. ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల పట్టణ ప్రజలు విద్యార్థి తల్లిదండ్రులను, విద్యార్థినిని అభినందించారు.
Spread the love