మహారాష్ట్ర‌లోని డొంబివ్లి ప్రాంతంలో భారీ అగ్నిప్ర‌మాదం..

నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్ర‌లోని డొంబివ్లి ప్రాంతంలో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ముంబై స‌మీపంలోని డొంబ్లివిలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఫ్యాక్ట‌రీలో గురువారం మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ వ్యాపించింది. ఫ్యాక్ట‌రీలోని ఓ బాయిల‌ర్‌లో పేలుడు కార‌ణంగా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెబుతున్నారు. ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్న నాలుగు అగ్నిమాప‌క యంత్రాలు మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ప్రాధ‌మిక ద‌ర్యాప్తు అనంత‌రం ఈ దుర్ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెలుగుచూస్తాయ‌ని అధికారులు వెల్ల‌డించారు.

Spread the love