బిజినెస్‌ ఉమెన్‌కు భరోస

          ఏదో సాధించాలనే తపన చాలా మందిలో ఉంటుంది. తమ కాళ్ళపై తాము నిలబడాలనే కోరిక ప్రతి మహిళకు ఉంటుంది. ‘నువ్వేం చేస్తాం’ అంటూ నిరుత్సాహపరిచే వారే ఎక్కువగా తారసపడుతుంటారు. ‘నువ్వు చెయ్యి, అండగా మేముంటాం’ అనే వారు చాలా తక్కువ. మహిళలకు ఇలాంటి భరోసా ఇచ్చే వారు దొరకడమే కష్టం. ఇక వారు చెయ్యాలనుకుంటుంది వ్యాపారమైతే… నష్టాలొస్తే ఎవరు భరిస్తారు..? అందుకే కుటుంబ సభ్యులు కూడా తొందరగా ఒప్పుకోరు. అలాంటి మహిళలకు అండగా నిలిచింది వురు హబ్‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. దీని నేతృత్వంలో ఎందరో మహిళలు వ్యాపారాలు ప్రారంభించి తామేంటో నిరూపించుకుంటున్నారు. అలాంటి వారిలో కొందరి అభిప్రాయాలు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేటి మానవిలో…

నా ఆశయాన్ని సార్ధకం చేసుకున్నా
          నేను ఫార్మసీలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పి.హెచ్‌డీ పట్టా పొందాను. నాలుగేండ్ల కిందట అనుకోకుండా వి హబ్‌ వాళ్ళు పెట్టిన ఓ సెమినార్‌కు అనుకోకుండా వెళ్ళాను. ప్రభుత్వానికి సంబంధించినది కదా పేపర్‌ ప్లేట్స్‌ బిజినెస్‌ అంటే సపోర్ట్‌ చేస్తారేమో అని అడిగాని. కానీ అక్కడ ఉండే శకుంతల మేడమ్‌ ‘నా చదువు, సామర్థ్యాన్ని తెలుసుకొని ఈ సంస్థ కేవలం చేస్తున్న వ్యాపారానికే కాదు, మీకేమైనా కొత్త ఆలోచనలునా మేము కచ్చితంగా సపోర్ట్‌ చేస్తాం’ అన్నారు. అప్పటికే ఏడాది నుంచి ఆరోగ్యానికి సంబంధించిన కెమికల్స్‌, ప్రిజర్వేటివ్స్‌ లేకుండా ఆలోవేరా, ఆమ్లా జ్యూస్‌ ఇంట్లో తయారుచేస్తున్నాను. వీటిని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా వ్యాపారం చేయాలనే ఆలోచన వుందని చెప్పాను. వెంటనే ఆరునెలల శిక్షణతో పాటు దానికి కావల్సిన సహకారం చేశారు. అప్పటి నుంచి దీనిపై ఎంతో పరిశోధన చేశాను. మన పాత సాంప్రదాయ విజ్ఞానానికి శాస్త్రీయ పద్ధతులు జోడించి ఉత్పత్తులు తయారు చేస్తున్నాను. వంటింటి మూలికలు, ఆకుకూరలు, కూరగాయలతో పౌషిక విలువలతో కూడిన, రోగానిరోధక శక్తిని పెంపొందించే సహజ ఉత్పత్తులను తయారు చేస్తున్నాను. మొదట్లో బిసినెస్‌పై ఎలాంటి అవగాహన లేదు. ప్రొడెక్ట్‌ ఉత్పత్తి, మార్కెటింగ్‌ ఇలా అన్నింట్లో వురు హబ్‌ నాకు సపోర్ట్‌ చేస్తూనే వుంది. ఆర్థిక స్థోమత పెద్దగా ఉన్న కుటుంబం కాదు మాది. వి హబ్‌ వారిచ్చిన లక్ష రూపాలయ రివాల్వింగ్‌ ఫండ్‌తోనే నా వ్యాపారాన్ని మొదలుపెట్టాను. పిల్లలు, మహిళల ఆరోగ్యానికి ఉపయోగపడే ఆర్గానిక్‌ పదార్ధాలతో ఉత్పత్తులను తయారు చేస్తున్నాను. రెండు రకాల ఉత్పత్తులతో ప్రారంభమైన వ్యాపారం ఇప్పుడు 21 రకాలను కష్టమర్లకు అందిస్తున్నాను. నా ఆశయాన్ని సార్ధకం చేసుకోవటానికి ప్రతీ అడుగులో తోడు ఉంటున్న ఈ సంస్థకి నా హృదయ పూర్వక ధన్యవాదములు.
– కల్పన గజ్జల

అంచలంచలుగా ఎదిగేలా…          2015లో కరీంనగర్‌లోని ప్రగతి నగర్‌లో బ్యూటీ స్కూల్‌ స్ధాపించాను. అప్పటి నుండి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సంస్థను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను. 2019లో బ్యూటీ ప్రాడక్ట్స్‌ ఉత్పత్తి కూడా ప్రారంభించాను. విదేశీ కస్టమర్లు ఐదు కోట్ల ఉత్పత్తులకి ఆర్డర్‌ ఇచ్చారు. కానీ వచ్చి సంస్థ వాతావరణాన్ని చూసి ఫ్యాక్టరీ పూర్తి హంగులతో వుంటే తప్ప ఆర్డర్‌ ఇవ్వలేమని వెనక్కు వెళ్ళిపోయారు. దాంతో తెలిసిన వారి ద్వారా పాత ఇల్లొకటి తొమ్మిదేండ్లకు లీజుకు తీసుకొని ఫ్యాక్టరీ ప్రారంభించా. అప్పటి నుండి అంచెలంచెలుగా ఎంతో కొంత ఉన్నతి సాధిస్తూనే ఉన్నాను. అదే సమయంలో వురు హబ్‌ వారు హర్‌ ఎండ్‌ నౌ ప్రోగ్రాంకి నన్ను ఎంపిక చేశారు. వాళ్ళు బిజినెస్‌లో అనేక మెళకువల గురించి ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ ఇచ్చారు. అలాగే నేను బ్రాండింగ్‌లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించి వారే ఆర్ధిక సహాయంతో బ్రాండిగ్‌ క్రియేట్‌ చేశారు. ఆ సమయంలో ట్రైనింగ్‌ ఇచ్చిన జర్మనీ యూనివర్సిటీ వారు వివిధ రాష్ట్రాలనుంచి ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఎన్నుకుని వారి గురించి ‘వురు మీన్‌ బిజినెస్‌’ అనే పుస్తకం వేశారు. అందులో తెలంగాణా నుంచి ఎంపికైన ఏకైక మహిళను నేనే. అంతేకాదు తెలంగాణా స్టేట్‌ మోడల్‌ స్కూల్స్‌కి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రామ్స్‌ ఎస్సెసర్‌గా నన్ను రెగ్యులర్‌గా ఆహ్వానిస్తారు. నా దగ్గర ట్రైనింగ్‌ తీసుకున్న వారిలో 20మంది వరకు నా స్కూల్లోనే పని చేస్తున్నారు. నేషనల్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ వారు నిర్వహించే బ్యూటీ కోర్సు ప్రోగ్రాంలకు ఎగ్జామినర్‌గా కూడా నన్ను పిలుస్తుంటారు. అలాగే లైంగిక వేధింపుల నిరోధక కమిటీలో సభ్యురాలిగా కూడా ఉన్నాను. మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియమ్‌ ఎంటర్‌ ప్రైజస్‌ అండర్‌ మినిస్ట్రీ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ వారు వారి ప్రోగ్రాములకు, క్లాసులు నడపటానికి, వర్క్‌ షాపులకు నన్ను ఆహ్వానిస్తుంటారు. ఇప్పటి వరకు ఓ వ్యాపారవేత్తగా సుమారు 16 అవార్డులు అందుకున్నాను.
– శైలజ

నా ఎదుగుదలకు దోహదం…
          వ్యాపారం చేయాలనే సంకల్పం బలంగా ఏర్పరచుకున్నాక పనితనం పట్టుదల కలిగిన నేను అందులో నైపుణ్యాలను ఆకళింపు చేసుకోవాలనుకున్నాను. మల్బరి సాగు, పట్టుపురుగుల పెంపకం ఎలా చేయాలో బెంగుళూరుకు వెళ్ళి శిక్షణ తీసుకున్నాను. ఇందుకు వురు హబ్‌ నిర్వహించిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది. అకౌంటింగ్‌, మార్కెటింగ్‌, బ్యాంకింగ్‌ వంటి అంశాలపై అవగాహనకు క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి తోడ్పడ్డాయి. రెండు ఎకరాల పొలంలో నెలకు 60 నుంచి 70 వేల వరకు సంపాదించ వచ్చని గ్రహించి స్వయంగా కొన్నాళ్ళు మల్బరి మొక్కల పెంపకం చూసి వచ్చి పట్టుపురుగుల పెంపకం మొదలు పెట్టాను. 2014లో మొదలు పెట్టిన మొదటి సాగులో నాకు వచ్చిన మొదటి లాభం నలభై వేలు. తర్వాత క్రమంగా పెంపకాన్ని దశల వారీగా పెంచాను. సేంద్రీయ పద్ధతిలో పట్టుపురుగులను పెంచి పట్టుదారం ఉత్పత్తికి దోహదం చేసే ూ= ూఱశ్రీసర నిర్వహణలో కొత్తగా పట్టుపురుగుల పెంపకం చేపట్టే వారందరికీ మార్గదర్శకం అనిపించుకున్నాను. మహిళలు ఏ రంగంలో నైనా రాణించగలరు అని నిరూపిస్తూ పట్టుపురుగుల పెంపకంలో తనదైన విశిష్ట స్థానాన్ని ఏర్పరుచుకున్న నాకు వురు హబ్‌ గుర్తింపు పొందిన మహిళగా, తెలంగాణలో ఆటోమేటిక్‌ రీలింగ్‌ రీలింగ్‌ మెషీన్‌ పొందిన తొలి మహిళగా తనదైన ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాను. అందుకు వురు హబ్‌కు ఎన్నటికీ ఋణపడి ఉంటాను.
– శిల్ప నెదురుగొమ్ముల, సిల్క్‌ ఇండియా వ్యవస్థాపకులు

సహకారం మరువలేనిది
          మాది నిజామాబాద్‌ జిల్లా, మాక్లూర్‌ మండలం. కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో నా వ్యాపారం మొదలుపెట్టాను. మొదట కీ చైన్స్‌, పౌచెస్‌తో వ్యాపారం ప్రారంభించిన తర్వాత గాజుల తయారీపై దృష్టి కేంద్రీకరించాను. ఇప్పుడు ఈ వ్యాపారం ఇరు రాష్ట్రాలకు వ్యాపించి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. దుకాణ దారులు ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంతలో మాకూ ఆ కళ నేర్పమని ఎందరో మహిళలు ముందుకు వచ్చారు. ఒకప్పుడు రెండువేల కోసం చెప్పులరిగేలా తిరిగినా అప్పు పుట్టలేదు. ఇప్పుడు రెండు వేలు, రెండు లక్షలు కాదు, పది లక్షలిస్తామని, కాదు కాదు పదిహేను లక్షలిస్తామంటూ బ్యాంక్‌ వాళ్ళే నా దగ్గరకి వస్తున్నారు. చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న చేతి కళను, ఆత్మవిశ్వాసాన్నే పెట్టుబడిగా పెట్టి సాగించిన ప్రస్థానం ప్రస్తుతం శాఖోపశాఖలుగా విస్తరించింది. వందలాది మంది మహిళలకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దగలుగుతున్నాను. అంతేకాదు రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాల తరఫున వందల మందికి శిక్షణ ఇచ్చే ఏకైక ఫాకల్టీగా మారారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా, కట్టుబాట్లు, అడ్డంకులు, అవాంతరాలు అడుగడుగునా అడ్డుపడుతున్నా ధైర్యంతో ముందడుగేసానంటే దానికి ముఖ్య కారణం వురు హబ్‌ ఇచ్చిన సహకారం. వారు వ్యాపారం విస్తరించడానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.
– ఉజ్మా బేగం

సేకరణ : అక్షరయాన్‌ టీం

Spread the love