పరిశోధన రంగంలో జగదీశ్వరచారికి అవార్డు

నవతెలంగాణ – కోహెడ
మండలంలోని వింజపల్లి గ్రామానికి చెందిన డాక్టర్‌ తూమోజు జగదీశ్వరచారికి అవుట్‌ స్టాండిరగ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ రిసెర్చ్‌ కమల్‌ పాత్ర అవార్డు 2024కు జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నెషనల్‌ జిల్లా అధ్యక్షుడు రాజు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో వారు మాట్లాడుతూ ప్రతియేడు జెసీఐ నిర్వహించే పలు రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం పట్ల అవార్డుకు ఎన్నికైనట్లు తెలిపారు. ఆయన ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అద్యాపకుడిగా సేవలందిస్తున్నారు. అలాగే సుమారు 20 అంతర్జాతీయ స్థాయిలో తమ పరిశోధన పత్రాలను వెలువరించారు. గూగుల్‌ స్కాలర్‌, రిసర్చ్‌ గేట్‌లలో పొందుపర్చబడ్డాయని, అంతేకాకుండా ఐదు అంతర్జాతీయ పత్రికలకు రివ్యూ మెంబర్‌గా, ఎడిటర్‌గా ఉన్నారు. మూడు పుస్తకాలను రచించారు. రేపు నర్సయ్య భవన్‌, మంచిర్యాలలో జరగబోయే సమావేశంలో అవార్డు అందించనున్నట్లు తెలియజేశారు. అవార్డుకు ఎంపిక కావడం పట్ల మిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Spread the love