ఉత్తమ సూపర్వైజర్ గా ప్రమీల రాణికి అవార్డు

నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండలం ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీలరానికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చరిత్ర మీదుగా ఆమె ఈ అవార్డును అందుకుంది. జిల్లా నుంచి ఆర్మూర్ ఏ సిడిపిఓ స్వర్ణ, అంగన్వాడీ కార్యకర్త గంగాజమునలకు అవార్డులు అందజేయడం జరిగింది. ఉత్తమ సూపర్వైజర్ గా అవార్డును అందుకున్న ప్రమీలరానికి మండలంలోని అంగన్వాడి కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మరిన్ని అవార్డులను అందుకొని, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందజేయడానికి ఆమె చేస్తున్న కృషి అభినందనీయమని వారు కొనియాడారు.
Spread the love