డప్పు కళాకారులకు డప్పులు ప్రదానం..

– రొమాల లక్ష్మణ్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో రొమాల లక్ష్మణ్ ఫౌండేషన్  ఆధ్వర్యంలో నిర్వహించిన రొమాల లక్ష్మణ్ 19 వ వర్ధంతి వేడుకలు, స్మారక అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమనికి ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు..ఈ సందర్భంగా రొమాల లక్ష్మణ్  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలు అర్పించారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూకలమర్రి గ్రామంలోని పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి, నగదు బహుమతి  అందించారు.. కళాకారులను సన్మానించి, డప్పు కళాకారులకు డప్పులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రోమాల లక్ష్మణ్ పౌండేషన్ వారి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.తన తండ్రి ఆలోచనలను ముందుకు తీసుకుపోవడానికి ఫౌండేషన్ ఏర్పాటు చేసి వివిధ సేవ మార్పుల ద్వారా సేవ చేస్తున్న రోమల ప్రవీణ్ అభినందించారు.ప్రభుత్వం తరుపున  ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ వివిధ మార్గాల ద్వారా ఫౌండేషన్ సభ్యులు సేవ కార్యక్రమాలు కొనసాగించడం పట్ల అభినందనలు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రజా సంక్షేమం ధ్యేయంగా పని చేస్తుందన్నారు.దాట్లో భాగంగా మహిళాలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించామని,ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంచడం,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు.గతం నుండి ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.రానున్న రోజుల్లో ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాల ద్వారా ముందుకు పోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్, ఎంపీటీసీ రంగు వెంకటేష్ గౌడ్, రోమాల ప్రవీణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love