Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూలిపురుగుల నివారణపై ఉపాధ్యాయులకు అవగాహన

నూలిపురుగుల నివారణపై ఉపాధ్యాయులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం  జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.స్థానిక ప్రభుత్వ పాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నరసింహస్వామి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం, పోషకాహారం మెరుగుపరచే లక్ష్యంతో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.పిల్లల శరీరంలో నులిపురుగులు ఉండటం వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు.

ప్రతి 6 నెలలకు ఒకసారి అల్బెండజోల్ మాత్ర వేయించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, చదువులో చురుకుగా ఉంటారని వివరించారు. మండల విద్యాధికారి ఆంధ్రయ్య మాట్లాడుతూ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తామని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, మరుగుదొడ్లు వినియోగించడం వంటి అలవాట్లపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను, ఆంగన్‌వాడీ టీచర్లను కోరారు.ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, తల్లిదండ్రులకు కూడా ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, ఆరోగ్య విస్తరణ అధికారి మహేందర్, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆంగన్‌వాడీ టీచర్లు, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -