భారత ప్రధాని నరేంద్ర మోడీ మహిళ ల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, ఎంపీపీ రజనీకిషోర్ జడ్పిటిసి మేక విజయ సంతోష్ లు స్పష్టం చేశారు. మంగళవారం రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చసిన మహిళల అభివృద్ధి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. స్వయం సహాయక సభ్యుల బృందాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిత్త శుద్ధితో కేంద్ర ప్రభుత్వం కష్టపడుతుందన్నారు. గత 5 ఏళ్లలో 6.382 కోట్ల రూపాయల పంపిణీ జరిగిందన్నారు. ప్రతి పేదింటి మహిళకు సొంత ఇల్లు కావాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకుగాను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద సుమారు 7 కోట్ల మందికి సొంత ఇంటి సహకారం అందించామని వారు పేర్కొన్నారు. ప్రతి పేదింటికి 5 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలని తలంపుతో మరో 5 ఏళ్ల పాటు దానిని పొడిగించడం జరిగిందని వారు తెలిపారు. ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవిని ఇవ్వడం మోడీ జీకే తగ్గదన్నారు. కేంద్ర క్యాబినెట్లో 11 మంది మహిళలకు చోటు ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే మోడీజీ ప్రధాన లక్ష్యం అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు క్యాతం యోగేష్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, బిజెపి మండల అధ్యక్షులు గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శులు ఎల్పీ పోచయ్య, ఈర్ల రాజు, మహిళలు పాల్గొన్నారు..