ఉపాధి కూలీలకు అవగాహన..

Awareness for employed workers..నవతెలంగాణ – మద్నూర్
ఉపాధి హామీ పథకం పనులు చట్టంతో కూడినవి. ప్రతిరోజు ఉపాధి కూలికి ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా రూ.307 రావాలి. శుక్రవారం మద్నూర్ మండలం స్పెషల్ అధికారి మండల ఎంపీడీవో మండల ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి తదితరులు కలిసి మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను అధికారులు పరిశీలించారు. ఉపాది పనులు ఎలా జరుపుకోవాలనే దానిపై అధికారులు ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. ప్రతిరోజు రావలసిన కూలీ రావాలంటే కొలతల ప్రకారం పనులు జరుపుకుంటే ప్రతిరోజు రూ.307 పొందవలసిందేనని తెలిపారు.  దీనితోపాటు సుల్తాన్ పెట్, గ్రామపంచాయతీ పరిధిలో గల నర్సరీ కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు. మండల స్పెషల్ అధికారి తోపాటు మండల అభివృద్ధి అధికారి రాణి, మండల ఉపాధి హామీ ప్రోగ్రామ్ అధికారి పద్మ, పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Spread the love