ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలపై అవగాహన

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం నీల గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం ప్రత్యేక పారిశుధ్య వారోత్సవంలో భాగంగా గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించిన ప్రత్యేక అధికారి ముని నాయక్. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకొని పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. మురికి కాలువలు లేని ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ఇంకుడు గుంతల వలన పరిసరాలు శుభ్రంగా ఉండడంతో పాటు, భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి బి. రాణి, కారోబార్ రమేష్, క్షేత్ర సహాయకులు నారాయణ, అంగన్వాడీలు రాజ్యశ్రీ, పర్వవ, స్రవంతి, వైద్య సిబ్బంది ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love