నవతెలంగాణ – చండూరు
స్థానిక సన్ షైన్ స్కూల్ జిల్లా పారామెడికల్ ఆఫీసర్ ఆరిఫ్ విద్యార్థినీ విద్యార్థులకు శుక్రవారం జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన గురించి అవగాహన కల్పించారు. కుష్టువ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియ వలన వస్తున్నదని, చర్మానికి, నరాలకు సోకుతుందని, ఈ వ్యాధిని నయం చేయవచ్చనని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ.. విద్యార్థులకు ఈ వ్యాధిని యం.డి.టి. విధానంలో పూర్తిగా నయం చేయవచ్చునని తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పారామెడికల్ ఆఫీసర్ ఆరిఫ్, పాఠశాల కరెస్పాండెంట్ కోడి వెంకన్న, స్కూల్ డైరెక్టర్ కోడి సుష్మ, డాక్టర్ మాస రాజు, సిహెచ్ఓ నర్సింగా రావు, ప్రిన్సిపాల్ రవికాంత్, లతీఫ్ పాషా, ఏఎన్ఎం ఆశ కార్యకర్తలు, ఉపాధ్యాయని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.