నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రీమియర్ షాపింగ్, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కు గమ్యస్థానాలు అయిన నెక్సస్ సెలెక్ట్ మాల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నియమితులయ్యారు. భారతదేశపు మొట్టమొదటి లిస్టెడ్ రిటైల్ మాల్స్ ఇవి. నెక్సస్ కు దేశవ్యాప్తంగా 17 మాల్స్ కలవు. లక్షలాది మందికి ఉత్సాహపూరిత షాపింగ్ అనుభవాలు అందించాలన్న లక్ష్యంతో నెక్సస్ సెలెక్ట్ మాల్స్ ప్రయాణంలో ఈ కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. అన్ని వయసుల ప్రేక్షకులు ఆయుష్మాన్ ఖురానాతో కనెక్ట్ అయ్యారు. ఆయన డైనమిక్ పర్సనాలిటీ, ట్రెండ్‌సెట్టింగ్ అప్పీల్ నెక్సస్ సెలెక్ట్ మాల్స్‌కి సరైన ప్రతినిధిగా చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ ఇంటికి తిరిగి వస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. నెక్సస్ సెలెక్ట్ మాల్స్ ఎప్పుడూ అగ్రశ్రేణి రిటైల్, వినోదాన్ని అందించడంలో ముందంజలో ఉంటుందన్నారు. మరోసారి భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నిశాంక్ జోషి మాట్లాడుతూ ఆయుష్మాన్ ఖురానాను స్వాగతించడానికి సంతోషిస్తున్నామన్నారు. వినియోగదారుల కోసం ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన షాపింగ్ అనుభవాలను అందించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.