- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థినిపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల ఉదయ్ అనే విద్యార్థి, తన క్లాస్‌మేట్‌తో కలిసి ఈ నెల 14న దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మద్యం కొనుగోలు చేసి, నిర్మానుష్య ప్రాంతంలో ఆమెకూ తాగించాడు. అనంతరం మత్తులో ఉన్న విద్యార్థినిని ఓ గదికి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
- Advertisement -



