- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి
బడీడు పిల్లలందరిని బడీలో చేర్పించాలని ప్రధానోపాద్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ తల్లిదండ్రులను కోరారు. గురువారం మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయుడు బడి బాట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రుల ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించిందని..ప్రభుత్వ బడులను సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ సూచించారు. సర్పంచ్ బొల్లం శ్రీధర్,ఉపాధ్యాయ సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



