Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు

ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు

- Advertisement -

– ఎస్సీ కాలనీ తాడిచెర్ల ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ స్వామి పిలుపు
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు పునాదులని తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలలో భాగంగా తాడిచెర్ల  ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు గీత ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం, తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ హాజరై మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధనతో పాటు అత్యాధునిక సౌకర్యాలు స్మార్ట్ క్లాస్, స్మార్ట్ లైబ్రరీ, స్టెమ్ ల్యాబ్, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్, బాలబాలికలకు వేరువేరు టాయిలెట్ ఫెసిలిటీ వంటి సౌకర్యాలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల ఉచిత పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్సీ కాలనీ పాఠశాలలో విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తాడిచెర్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తిరుపతిరెడ్డి, హై స్కూల్ టీచర్స్, ఎస్సీ కాలనీ టీచర్స్,అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు,తల్లి దండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -