బడిబాట గ్రామసభ ..

నవతెలంగాణ – గోవిందరావుపేట

మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం  ఆవరణలో మంగళవారం బడిబాట గ్రామసభ నిర్వహించారు ఈ గ్రామ సభకు అధ్యక్షులుగా స్పెషల్ ఆఫీసర్ సాహిదా బేగం అధ్యక్షత వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి డేగల శంకర్  గ్రామసభ ఎజెండాను చదివి వినిపించారు. 6-6- 2024 నుండి 11 -6 -2024 వరకు జరిగిన బడిబాట కార్యక్రమము యొక్క ప్రగతిని గురించి చర్చ జరిగింది. బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లో  నమోదు చేయుటకు కృషి. బడి బయట పిల్లలు ఉంటే వారిని కూడా బడిలో చేర్పించాలి. పై ఎజెండా ఆధారంగా చర్చ నిర్వహించబడినది. మండల విద్యాశాఖ అధికారి  గొంది దివాకర్  మాట్లాడుతూ నేడు ప్రభుత్వం పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించిందని అన్నారు. మండలంలోని పాఠశాలలలో మధ్యాహ్న భోజనం రాగి జావా నోట్ పుస్తకాలు ఉచితంగా  ఇస్తున్నారని అన్నారు నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తుందని గుర్తు చేశారు. ఉత్తమ ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉన్నారని అన్నారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని ఆయన కోరారు. సెక్టోరియల్ ఆఫీసర్ రాజు మాట్లాడుతూ.. మన ఊరు మనబడి అనే కార్యక్రమము కింద జిల్లాలో 125 పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని అన్నారు.
డిజిటల్ విద్యా బోధన నూతన బెంచీలు పాత వస్తువులు అన్ని నేడు ఉన్నాయన్నారు మరో సెక్టోరియల్ ఆఫీసర్ సాంబయ్య  మాట్లాడుతూ.. విద్యార్థులకు సామాజిక స్పృహ మానవ సంబంధాలు ప్రభుత్వ పాఠశాలలోనే అందుతాయని అన్నారు నోడల్ ఆఫీసర్ సోమా రెడ్డి  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల గోవిందరావుపేటలో కనీసం 30 మంది విద్యార్థులు ఈ బడిబాట కార్యక్రమాలలో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు వారందరికీ సొంత ఖర్చులతో టై బెల్టు డ్రెస్ అందిస్తామని అన్నారు అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ పాఠశాలలో వచ్చే విద్యార్థులకు ట్రావెలింగ్ అలవెన్స్ వ్యక్తిగతంగా మేమే ఇస్తామని  అన్నారు కే రఘురాం  మాట్లాడుతూ ఆవాస ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లలందరినీ గుర్తించామని వారందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా ప్రేరణ కలిగించామని అన్నారు. ఐదు సంవత్సరాలు వయస్సు  నిండిన పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలని కోరారు స్పెషల్ ఆఫీసర్ సాహిదాబ్ బేగం  మాట్లాడుతూ బాల్యంలో మనమందరము ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఈ స్థాయికి వచ్చామని గుర్తు చేశారు. నాడు నేడు పాఠశాలలో కు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా మనమందరం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు సిఆర్పిలు అంగన్వాడీ టీచర్లు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love