హైదరాబాద్ : యోనెక్స్ సన్‌రైజ్ ఎంకె హెచ్‌ఎస్‌ఎం ఇండియా జూనియర్ ర్యాంకింగ్ నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ మంగళవారం ముగిసింది. సికింద్రాబాద్‌లోని ఆర్‌ఆర్‌సీ వేదికగా జరిగిన అండర్-19 టోర్నీలో యువ షట్లర్లు సత్తా చాటారు. మహిళల సింగిల్స్‌లో సూర్య చరిష్మా 11-21, 21-8, 21-18తో ఆలిషా నాయక్‌పై, బార్సు విభాగంలో ధృవ్ 21-16, 23-21తో గిన్‌పాల్‌పై విజయం సాధించి చాంపియన్స్‌గా నిలిచారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో మిథిలేష్, రేషికా.. బార్సు డబుల్స్‌లో ఆరోరా, ఆర్షలు విజేతలుగా నిలిచారు. విజేతలకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌తో కలిసి భారత అగ్రశ్రేణి షట్లర్లు సిక్కి రెడ్డి, అర్జున్ రెడ్డిలు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా చైర్మన్ పీసీఎస్ రావు, బ్యాడ్మింటన్ ఆఫీస్ బేరర్లు శ్రీనివాస రావు, యూవీఎన్ బాబు, కె. వంశీధర్, పి.వికాశ్ హర్ష, పీవీఎల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.