హరిపిరాల గ్రామంలో బగ్గుమన్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పోరు

– శిలాఫలకాలు పగలగొట్టిన కాంగ్రెస్ నాయకులు
– ఎమ్మెల్యేను ఆహ్వానించినా రాలేదన్న సర్పంచ్
– ప్రోటోకాల్ ప్రకారమే శిలాఫలకాల పై పేర్లు
నవతెలంగాణ – తొర్రూర్ రూరల్ 
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండలంలోని హరిపిరాల గ్రామంలో స్థానిక టీఆర్ఎస్ సర్పంచ్ రావుల మమత జగదీశ్వర్ రెడ్డి గ్రామంలో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడానికి ముహూర్తం ఖరారు చేసి ఎమ్మెల్యేను యశస్విని రెడ్డిని ఆహ్వానించినా రాకపోవడంతో స్థానిక సర్పంచి, ఎంపీటీసీ, ఉపసర్పంచ్ గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను,  గ్రంథాలయ నిర్మాణాన్ని స్థానిక నాయకులు  ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులు శిలాఫలకాలను పగలగొట్టి ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తే తప్పేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పనులను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రజల అవసరాల కోసం వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా ఇబ్బందులు పడి మిషన్ భగీరథ ట్యాంక్ ను పూర్తిచేసి ప్రజలకు మంచినీరు అందివ్వడానికి కృషి చేస్తుంటే, గ్రామంలో యువకుల కోసం గ్రంథాలయ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రారంభ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించామని,  శిలాఫలకాలపై  ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే పేరు మంత్రుల పేర్లు ముద్రించామని, అయినా ఇలా అడ్డుకోవడం, శిలాఫలకాలు పగలగొట్టడం మంచిది కాదని స్థానిక నాయకులు అన్నారు. ఈ ప్రారంభం కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రావుల మమత జగదీశ్వర్ రెడ్డి, ఉపసర్పంచ్ చెంచర్ల రాజు, ఎంపీటీసీ వల్లపు గోపమ్మ, వార్డు సభ్యులు మురళి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యేను ఆహ్వానించా..సర్పంచ్ రావుల మమత జగదీశ్వర్ రెడ్డి వేసవి కాలంలో ప్రజల అవసరాల రీత్యా గత  ప్రభుత్వంలో నిర్మాణాలు చేసినప్పటికీ, ప్రారంభించకపోవడంతో, ప్రారంభ కార్యక్రమానికి యశస్విని రెడ్డిని స్థానిక ఉపసర్పంచ్ రాజుతో కలిసి ఆహ్వానించామని, ప్రారంభ కార్యక్రమానికి వేచి చూసినప్పటికీ రాకపోవడంతో మేమే కలిసి ప్రారంభించామని, ప్రారంభించిన కొద్దిసేపట్లోనే స్థానిక నాయకులు శిలాఫలకాలను పగలగొట్టి విధ్వంసం చేశారని, ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామంలో గతంలో ఇప్పుడు కూడా ఇలాంటి జరగలేదని పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రులకు, జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ తెలిపారు.
Spread the love