న్యూఢిల్లీ: బజాజ్ ఫైనాన్స్ రూ.341 కోట్ల జీఎస్టీని ఎగవేసిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) తెలిపింది. దీనికి సంబంధించిన ఈ నెల 3న పన్ను ఎగవేత నోటీసులను జారీ చేసినట్లు వెల్లడించింది. కంపెనీకి మొత్తం 160 పేజీల నోటీసు పంపింది. మినహాయింపు ప్రయోజనాలను పొందేందుకు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ సర్వీస్ లేదా ప్రాసెసింగ్ ఛార్జీలను వడ్డీగా పరిగణించడం ద్వారా జీఎస్టీని ఎగవేస్తోందని డీజీజీఐ తెలిపింది. ఈ అంశంలో రూ. 341 కోట్ల పన్ను ఎగవేత, రూ.150 కోట్ల వడ్డీ సహా జరిమానా కలుపుకుంటే మొత్తంగా రూ.850 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది.