బంధన్ బ్యాంక్ రెండు కొత్త శాఖలు ఆరంభం

• తెలంగాణా రాష్ట్రంలో బ్యాంకింగ్ అవుట్ లెట్స్ మొత్తం సంఖ్య 142
• తెలంగాణలో బంధన్ బ్యాంక్ సుమారు 5 లక్షల ఖాతాదారులకుసేవలు అందిస్తుంది
• భారతదేశ వ్యాప్తంగా 6,250 బ్యాంకింగ్ అవుట్ లెట్స్ ద్వారా 3.25 కోట్లఖాతాదారులకు బ్యాంక్ సేవలు అందిస్తుంది.
నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్ లోని చార్మినార్ ఒకట అబిడ్స్ వద్ద మరొకటి 2 బంధన్ బ్యాంక్ శాఖలు ఈరోజుప్రారంభించారు. ఈ కొత్త శాఖాల ప్రారంభంతో దేశ వ్యాప్తంగా బ్యాంక్ శాఖల సంఖ్య 1664 నకు చేరుకున్నాయి. చార్మినార్ శాఖను గోల్కొండ శ్రావణ్, జనరల్ సెక్రటరి, చర్కామాన్ స్వర్ణకార అసోసియేషన్ వారు ప్రారంభించారు . అబిడ్స్ శాఖనుఅడిషనల్ కమీషనర్, తెలంగాణా దేవాదాయ శాఖా వారుప్రారంభించారు. అబిడ్స్ శాఖను ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధన్ బ్యాంక్ సీనియర్ అధికారులతో పాటు స్థానిక ప్రముఖులు పాల్గోవటంజరిగినది. బంధన్ బ్యాంక్ ఈరోజు కర్నాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో కూడ మరో 4 నూతన శాఖలను ప్రారంభించినట్లు ఈసందర్భంగా తెలియచేసారు. బంధన్‌బ్యాంక్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మందికస్టమర్‌లను కలిగి ఉంది 140 కంటే ఎక్కువ బ్యాంకింగ్అవుట్‌లెట్‌ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. బంధన్ బ్యాంక్ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలితప్రాంతాలలో శాఖలను కలిగి వినియోగదారులకు తమ ఉత్తమ సేవలనుఅందిస్తున్నాది.
ప్రతి భారతీయ పౌరుడు ఎక్కడ నివసిస్తున్న అతనిఆర్ధిక అవసరాలను తెలుసుకుని విభిన్న ఆర్ధిక పథకాలనుఅందించుటకు బంధన్ బ్యాంక్ కట్టుబడి ఉంటుందని నూతన శాఖలుప్రారంభం సందర్భంగా తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో నుతంగా రెండు శాఖను ప్రారంభించటం మాకుచాల సంతోషంగా ఉంది అన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన బంధన్బ్యాంక్ యండి, సిఇఓ చంద్రశేఖర్ ఘోష్. రాష్ట్రంలోని ఖాతాదారులఅనేకమైన బ్యాంకింగ్ అవసరాలను తీర్చుటకు తమ బ్యాంక్ కట్టుబడుఉంటుంది అన్నారు. మా పైన ఖాతాదారులు చూపిస్తున్న విశ్వాసమేమేము మా శాఖలను ఇక్కడ ప్రారంభించుటకు దోహదపడినట్లుతెలిపారు. ఖాతాదారుల సౌలభ్యత కొరకు మా డిజిటల్ బ్యాంకింగ్వ్యవస్థను మెరుగుపరచుటకు మేము దృష్టి సారిస్తున్నాము అన్నారు. మానవ సంబంధాలు తమ బ్యాంకింగ్ అనుబంధాల పైనవిశ్వాసం కనపరిచే వర్గాల ప్రజల కోసం కూడ మేము శాఖలనుస్థాపిస్తామని చండ్ర శేఖర్ ఘోష్ అన్నారు.

Spread the love