నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి గోదావరి లో పుణ్య స్థానాలను ఆచరించడానికి వచ్చిన బాలామణి అనే మహిళ గోదావరిలో ప్రమాదవశాత్తు జారి గల్లంతయ్యింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు, 108 వాహనం, ఫైర్ ఇంజన్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి నా లాభం లేకపోయింది. పాండు వారానికి చెందిన బాలమణి కందకుర్తి గోదావరిలో ఉన్న రాతి శివాలయం పక్కన గల మెట్ల వద్ద పుణ్య స్థానాలను ఆచరిస్తున్న క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు జారిపడిందని తెలిసింది. మార్చి 1న బాబ్లీ గేట్లను ఎత్తివేయడంతో వరద ఉధృతి పెరగడంతో లోనికి వెళ్లడానికి ఎవరు ముందుకు రావడం లేదు. వరద ఉధృతి తగ్గిన తర్వాత గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.