నవతెలంగాణ – రెంజల్
తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాల నుంచి గొర్రెల కాపరులు వాటి ఆహారం కోసం మహారాష్ట్రకు తీసుకువెళుతన్నట్లు గొర్రెల కాపర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఆరుతడి పంటలు పూర్తయిన సందర్భంగా అక్కడ నేలపై పడే సోయా, పెసర, లాంటి పంటలను ఆహారంగా తీసి కొట్టు సుమారు మూడు నెలల వరకు మహారాష్ట్రలోని తలదాచుకుంటూ వాటిని కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు. పొలాలలోని ఉంటూ వంటలు చేసుకుని తాము తిరిగి పంటలు వేసే వరకు అక్కడే తలదాచుకుంటామని వారు తెలిపారు.గొర్రెల కాపరి అబ్బుగొండ : తెలంగాణలోని బోధన్ మండల కేంద్రంలోని రాకాసి పేట నుంచి తమ గొర్రెల ఆహారం కోసం వాటిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గొర్రెల కాపరి అబ్బు గొండ పేర్కొన్నారు. తనకు వందల సంఖ్యలో గొర్రెలు ఉండటం వల్ల రోజువారి కూలిగా మరొకరిని తీసుకొని మూడు నెలలు వాటిని కాపాడుకుంటూ అక్కడే ఉంటామని ఆయన పేర్కొన్నారు.