Thursday, May 21, 2026
E-PAPER
Homeఆటలుబంగ్లాదేశ్ క్లీన్ స్వీప్

బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్

- Advertisement -

రెండో టెస్ట్ లో పాకిస్తాన్ పై 78పరుగుల తేడాతో గెలుపు
సైహేట్(బంగ్లాదేశ్): పాకిస్తాన్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు 2-0తో చేజిక్కించుకొని క్లీన్ స్వీప్ చేసింది. దీంతో పాకిస్తాన్ పై తొలిసారి క్లీన్ స్వీప్ సాధించిన బంగ్లా జట్టుగా రికార్డుపుటల్లోకెక్కింది. 457పరుగుల భారీ ఛేదనలో భాగంగా పాకిస్తాన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 358 పరుగులకు కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోర్ 7వికెట్ల నష్టానికి 316 పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ జట్టు మరో 42 పరుగులు జతచేసి చివరి మూడు వికెట్లను కోల్పోయింది. ఓవర్ నైట్ బ్యాటర్ రిజ్వాన్(94) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. సాజిద్ ఖాన్(28) బ్యాటింగ్ లో రాణించాడు. ఇక షహజాద్(0) నిరాశపరచడంతో ఐదో, చివరి రోజు పాకిస్తాన్ ఇన్నింగ్స్ తొలి సెషన్ లోనే ముగిసింది. బంగ్లాదేశ్ బౌలర్లు తైజుల్ ఇస్లామ్ ఆరు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చగా.. నహిద్ రాణాకు రెండు, షోరిఫుల్, మెహిదీ హసన్ లకు ఒక్కో వికెట్ దక్కాయి. తొలి టెస్ట్ లో 104 పరుగుల తేడాతో నెగ్గిన బంగ్లాదేశ్ రెండో టెస్ట్లఓ 78పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లింటన్ దాస్ కు, సిరీస్ ముష్ఫికర్ రహీమ్ కు దక్కాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -