మేడారం వనదేవతలకు బతుకమ్మ చీరలు..

– తొలి చీరను సమర్పించిన జడ్పీ చైర్మన్ నాగజ్యోతి
– వనదేవతలకు ప్రత్యేక ముక్కలు
నవతెలంగాణ- తాడ్వాయి: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలకు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ మొదటి చీరను సమర్పించింది. ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి మొదటి చీరను సమ్మక్క సారలమ్మల తల్లులకు సమర్పించారు. పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు, ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో నివాసి సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. బుధవారం వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీర సారె తో పాటు బతుకమ్మ చీరలను కూడా సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఆడపడుచులకు ఎంతో ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ సర్కార్ ప్రతి ఏటా వారికి ఎనలేని గౌరవం ఇస్తుందన్నారు. పండుగ పూట సంతోషంగా ఉండాలని మహిళ లోకానికి చీరలను అందజేస్తున్నట్లు జడ్పీ చైర్మన్ నాగజ్యోతి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పూలను పూజించే పండుగ బతుకమ్మను గౌరవించుకుంటామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దండుగుల మల్లయ్య,  స్థానిక తాసిల్దార్ తోట రవీందర్, స్థానిక సర్పంచ్ చిడం బాబురావు, ఊరట్టం సర్పంచ్ గొంది శ్రీధర్, మాజీ మండల అధ్యక్షులు ఎనగందుల బాబు రెడ్డి,  రామారావు, కోటయ్య, సురేష్ శివరాజ్, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ ఆలం శోభారాణి, మహేష్ కృష్ణయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, చందా హనుమంతరావు, సాంబశివరావు, నారాయణ, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love