హైదరాబాద్: మియాపూర్‌లో తమ మూడవ ఫర్నిచర్ స్టోర్‌ను ప్రారంభించినట్లు బే విండో వెల్లడించింది. బే విండో తొలి రెండు స్టోర్లు జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలో ఉన్నాయి. లివింగ్ రూమ్‌లు, డైనింగ్ రూమ్‌లు, బె్‌రూమ్‌లను మార్చడానికి రూపొందించిన విస్తృతమైన ఫర్నీచర్‌ను అందించడానికి తమ సంస్థ కట్టుబడి ఉందని బే విండో వ్యవస్థాపకులు సిద్దాంత్ ఆనంద్ అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌లో ఐదు స్టోర్లు. 2025 చివరి నాటికి హైదరాబాద్ వెలుపల మరో ఐదు స్టోర్లను ప్రారంభించాలని యోచిస్తోన్నామన్నారు.