విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి

– మండల అభివద్ధి అధికారి అంజిరెడ్డి
నవతెలంగాణ- ఉండవల్లి
గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే పంచాయతీ కార్యదర్శులు విధుల పట్ల బాధ్యతతో నిర్వహించాలని, రికార్డులను తప్పనిసరిగా నమోదు చేయాలని మండల అభివద్ధి అధికారి అంజిరెడ్డి అన్నారు. బుధవారం మానవపాడు మండలంలోని పెద్ద అందాలపాడు నారాయ ణపురం గ్రామ పంచాయతీలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీలో ఉండే రికార్డులను నమోదు ఎందుకు చేయలేదని పంచా యతీ కార్యదర్శులను ప్రశ్నించారు. నర్సరీలోనూ జరుగుతున్న పనులను శానిటైజర్‌ డంపింగ్‌ యార్డ్‌ జనన , మరణ నమోదు తదితర విష యాలను తప్పనిసరిగా రికార్డులో ఉండాలని అన్నారు. గ్రామాల్లో జరుగు తున్న హరితహారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు తప్పకుండా మాస్టర్‌ లో పేర్లు నమోదు చేసి రోజువారీ కూలీల పనుల దినాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదే శించారు. ఉపాధి పథకం ద్వారా కూలీలు లబ్దిపొందే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు , ఫీల్డ్‌ అసిస్టెంట్లు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love