ఆడవాళ్లకు అందం..ఆరోగ్యం

– సిరిసిల్ల పట్టణంలో ఆడవాళ్లకు ప్రత్యేక జిమ్‌ సెంటర్‌
– ఆరోగ్య జీవనంపై ఆసక్తి
– ఫిట్‌ అండ్‌ హెల్త్‌ పేరుతో జిమ్‌ బాట
బరువెక్కిన బాధను తగ్గించుకోవడానికి కొంతమంది యువత ఆలోచిస్తుండగా… మరికొంతమంది అందంగా మారేందుకు వ్యాయామ బాట పడుతున్నారు. ఈ కాలం యువత కొద్ది దూరం నడవాలన్నా ఆయస పడుతున్నారు. మారుతున్న కాలంతోపాటు చాలామంది ఉదయం, సాయంత్ర సమయంలో హిట్‌ అండ్‌ హెల్త్‌ పేరుతో జిమ్‌ బాట పడుతున్నారు. శరీరంలో దాగి ఉన్న కొవ్వును క్యాలరీల రూపంలో ఖర్చు చేస్తూ శరీరాన్ని అందంగా మార్చుకుంటున్నారు. వ్యాయామమైన జిమ్‌ఆట రూపంలో మార్చి యువతను తమదైన దారిలోకి తెచ్చుకుంటున్నారు.
నవతెలంగాణ – సిరిసిల్ల రూరల్‌
వ్యాయామ కసరత్తును సరికొత్త రూపంలోకి మార్చి ఫిట్నెస్‌ బాట పట్టిస్తున్నారు. స్కిప్పింగ్‌, సైక్లింగ్‌, టైర్‌ జంపింగ్‌ జాక్స్‌, హైయర్‌, రోప్‌, లాడర్‌, తదితర వాటిని 10-15 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఇదే ఫిట్‌ అండ్‌ హెల్త్‌ మంత్రం 3 నిమిషాల్లో 20 జంపింగ్‌ జాక్స్‌, 20 క్రంచెస్‌, 40 పుషప్స్‌ లు శరీరంలోని భాగాలన్నీ కదిలేలా పూర్తి చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక ఆంధ్రా బ్యాంక్‌ ఆవరణలో ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ”పవర్‌ జిమ్‌” ఫిట్నెస్‌ జోన్‌ను స్థాపించారు. ఉదయం 5- 11 గంటల వరకు సాయంత్రం 5-9 గంటల వరకు చేస్తున్నారు. అందరికీ ఉపయోగపడే మిషన్లు పెట్టారు. ట్రెడ్‌ మిల్‌, క్రాస్‌ ట్రైనర్‌, వెయిట్‌ లాస్‌, సైక్లింగ్‌ మిషన్‌, స్టమక్‌ మిషన్‌, చెస్ట్‌, డంబుల్స్‌, విస్ట్‌, హాండ్స్‌ మజిల్స్‌, అప్‌ సర్కిల్‌, వైబ్రేట్‌ తదితర మిషన్లు ఉన్నాయి.
జీరో సైజ్‌ కోసం అమ్మాయిల తపన..
మారుతున్న ట్రెండు అనుగుణంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మహిళలు సైతం యువకులతో సమానంగా వ్యాయామ అంశాలపై పోటీ పడుతున్నారు. అంతేకాకుండా జంక్‌ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం ఊభయకాయంగా మారిపోతుంటారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా రోజూ జిమ్‌ బాట పడుతున్నారు. తమ ఆకృతిని జీరో సైజ్‌ చేసుకోవడానికి అమ్మాయిలు వివిధ రకాలలో చాలా కష్టపడుతున్నారు.
అనారోగ్య సమస్యల బారిన పడకుండా..
ఉదయం, సాయంత్రం వాకింగ్‌, వ్యాయామాలు చేయడం అనారోగ్య సమస్యల బారిన పడకుండా కొంతమంది స్థానికంగా మైదానంలో కానీ ఇటువంటి ఆవరణలో కానీ వ్యాయామ పరికరాలను సమకూర్చుకుంటున్నారు. నిపుణుల సహకారంతో పరిమితితో వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు. సైక్లింగ్‌, స్కిప్పింగ్‌, డంబెల్స్‌ లను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు అరగంట పాటు వ్యాయామ రూపంలో చేస్తున్నారు. ఇంట్లో చేసే చిన్న చిన్న పనులతో రోజుకు కొన్ని గ్యాలరీల ఖర్చు అవుతాయని నిపుణులు అంటున్నారు. ఇందులో 50నుంచి 80కిలోలకు మించి బరువు ఉండేవారు విభాగాల వారీగా వ్యాయామం చేయడం మంచిది.

ఫిజికల్‌ ఫిట్నెస్‌ అనేది వాళ్ళకి అవసరం
ఇంట్లో ఎంత పని చేసినా మొత్తం శరీరానికి సరిపోదు. ఫిట్‌ అండ్‌ హెల్త్‌ జిమ్‌ సెంటర్లలో ట్రేనర్లు ఉంటారు కాబట్టి వారి సహాయంతో వ్యాయామం చేపిస్తారు. ఎక్సర్సైజ్‌ వల్ల మంచి హార్మోన్లు విడుదల అవుతాయి. ఈ హార్మోన్లు విడుదల కావడం వలన ఆడవాళ్ళకి నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. శరీరంలో ఫ్యాట్‌ పెరగడం వల్ల గుండె సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. వ్యాయామం, ఫిజికల్‌ ఫిట్నెస్‌ చేయడం వల్ల బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది. రోజువారీ పనిలో మనము ఎంత బిజీగా ఉన్నా రోజుకు ఒక గంట సేపు వ్యాయామం, ఫిట్నెస్‌ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా జిమ్‌ సెంటర్‌ పెట్టడం ద్వారా చాలామంది మహిళలు దీనిని ఉపయోగించుకుంటున్నారు. పవర్‌ జిమ్‌ బందానికి కతజ్ఞతలు తెలుపుతున్నాను.
– డాక్టర్‌ శోభారాణి, గైనకాలజిస్ట్‌

జీరో సైజ్‌ ఆకృతిపై అమ్మాయిల దష్టి..
మారుతున్న కాలంలో అమ్మాయిలు తమ శరీర ఆకృతిని అందంగా చేసుకునేందుకు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. జిమ్‌ సెంటర్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా సాధన చేయడం ద్వారా మార్పు కనిపిస్తోంది. శరీర ఆకృతిని అందంగా మార్చుకునేందుకు ఆహారపు అలవాట్లను సైతం మార్చుకుంటున్నారు. చేసే విధానం, తీసుకునే ఆహారం సరిగ్గా చేస్తే అందమైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. ప్రతిరోజు అందరికీ 45 నిమిషాల పాటు కచ్చితంగా వ్యాయామం చేపిస్తా. ఆడవాళ్లు లావుగా ఉంటే గర్భిణీ కావడం చాలా కష్టం. థైరాయిడ్‌ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం. జిల్లాలో ఆడవాళ్లకు ఫిట్నెస్‌ జోన్‌ లేదని ప్రత్యేకంగా మహిళల కోసం స్థాపించాను. నా భర్త 15 సంవత్సరాల నుండి మగవాళ్ళకి ఫిట్నెస్‌ జోన్‌ సిరిసిల్లలో నడిపిస్తున్నారు. నేను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సెంటర్‌ కి వచ్చి అవగాహన ఇస్తాను.
– షాజహా, జిమ్‌ కోచ్‌

అలసట రాదు..
ఉరుకులు పరుగుల్లోనే మన జీవితాలు గడుస్తున్నాయి. దీనివలన ఆరోగ్యం మీద దృష్టి పెట్టలేకపోతున్నాము. ఆడవాళ్ళకి సమయం లేకుండా పోతుంది. మహిళలు, యువతులు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రతిరోజు ఒక గంట సమయం కేటాయించుకుని వ్యాయామం చేయండి. వ్యాయామం వల్ల చాలా మార్పులు ఉంటాయి. ఎంత పని చేసినా అలసట అనేది ఉండదు. నేను సాఫ్ట్వేర్‌ ఉద్యోగిని. ఇంటి నుంచే పని చేస్తున్నాను. సిరిసిల్ల పట్టణంలో మహిళలకు ప్రత్యేకంగా జిమ్‌ సెంటర్ను ఏర్పాటు చేశారు. మహిళలు దీనిని ఉపయోగించుకోవాలి.
– శ్రీజ, సాఫ్ట్‌ వేర్‌
సైక్లింగ్‌..:
అరగంట సైక్లింగ్‌ చేయడం ద్వారా 200 నుంచి 300 క్యాలరీలు, గంటకు 12 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో సైకిల్‌ తొక్కితే 240 నుంచి 355 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అదే నడకతో గంటకు మూడు కిలోమీటర్ల వేగం నడిస్తే 135 నుంచి 200 క్యాలరీలు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
స్కిప్పింగ్‌..: స్కిప్పింగ్‌ 10 నిమిషాల వేగంతో చేస్తే.. 60 నుంచి 100 క్యాలరీలు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ట్రెడ్‌ మిల్‌..: ట్రెడ్‌ మిల్‌ 20 నుంచి 25 వేగంతో ప్రతిరోజు 15 నిమిషాల పాటు చేస్తే తొందరగా వెయిట్‌ లాస్‌ కావచ్చు. ఇది గుండెకు సంబంధిత వ్యాధి, షుగర్‌ వ్యాధి ఉన్న వారికి ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.
స్టమక్‌ మిషన్‌..: ఇది బరువు ఎక్కువగా ఉండి లావుగా ఉన్న వారికి ఉపయోగపడుతుంది. రోజు 20 నుంచి 25 సార్లు చేస్తే తొందరగా పొట్ట, మజిల్స్‌ తగ్గే అవకాశం ఉంటుంది.
డంబుల్స్‌.. : ఇది షోల్డర్‌, మజిల్స్‌ ఫిట్టింగ్‌ కోసం చేస్తారు. ఇవి చాలా బరువుగా ఉంటాయి. వీటిని రోజుకు 20 నుంచి 25 సార్లు చేయాలి.
వెస్ట్‌ మిషన్‌..: వెస్ట్‌ మిషన్‌ జీరో సైజ్‌, నడుము సన్నగా కావడానికి ఎక్కువగా తోడ్పడుతుంది. దీనిని 45 నుంచి 50 రౌండ్లు 15 నిమిషాల పాటు చేయాలి.
వైబ్రేటర్‌.. : లావుగా ఉన్న వారికి ఈ వైబ్రేటర్‌ మిషన్‌ చాలా ఉపయోగ పడుతుంది. శరీరం మొత్తాన్ని ఒకే సమానంగా చేస్తుంది. దీనివల్ల రక్తసరఫరా అవుతుంది. దానిని 10 నిమిషాలు కంటే ఎక్కువ చేయకూడదు.
అవగాహన ముఖ్యం..
– జిమ్‌ సెంటర్లలో ఉన్న పరికరాలు వినియోగంలో ఉన్నాయా లేదా అనే అంశాలను పరిశీలించాలి.
– నిపుణుల పర్యవేక్షణలోనే క్రమం తప్పకుండా కసరత్తు చేయాలి.
– ఇష్టానుసారంగా వ్యాయామం చేస్తే భవిష్యత్తులో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
– డెలివరీ అయ్యాక సంవత్సరం పాటు జిమ్‌ చేయకూడదు.

Spread the love