భయమెరుగని అమరుడు భగత్ సింగ్

– ఆర్టీఐ ఆధ్వర్యంలో 93వ వర్ధంతి వేడుకలు
నవతెలంగాణ – మల్హర్ రావు
భయమేరుగని అమరుడు భగత్ సింగ్ ని యునైటెడ్ ఫోరమ్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. భగత్ సింగ్ 93వవర్ధంతి ఉత్సవాల్లో భాగంగా యునైటెడ్ ఫోరం ఆఫర్, ఆర్టిఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడారు  మతసామ్రాస్యాన్ని కాపాడుకుంటూ ఉద్యమించినప్పుడే అమరవీరులకు నిజమైన నివాళి అర్పించడంన్నారు. అనేక ఉద్యమాలను అణచివేయాలని దేశంలో నూతన చట్టాల అమలు కోసం బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర చేస్తున్న క్రమంలో, శాసనసభలో సర్దార్ భగత్ సింగ్ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్ర లక్ష్యం కావాలని పోరాడారుని తెలిపారు. వందలాది భగత్ సింగ్లు పుట్టుకస్తారని, విరి కంభం ఎక్కినకొద్దీ భగత్ సింగ్ మూర్తితో ఇలా అన్నారని నేను చనిపోతే దేశానికి అదో ఉత్పతంగా మిగిలిపోతుంది, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టిన చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన సర్దార్ భగత్ సింగ్ నిజమైన నివాళులన్నారు. ఈక్రమంలో,కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ చంద్రమౌళి,చంద్ర బోస్ నిమ్మల ఓదెలు రాజయ్య
మధుకర్ రాజయ్య తాటిపాముల చంద్రయ్య రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love