భజే వాయు వేగం రిలీజ్‌కి రెడీ

భజే వాయు వేగం రిలీజ్‌కి రెడీయూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘భజే వాయు వేగం’. ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘హ్యాపీ డేస్‌’ ఫేమ్‌ రాహుల్‌ టైసన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు ప్రశాంత్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్‌ రాజు.పి. కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాను నేషనల్‌ వైడ్‌గా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ ధీరజ్‌ మొగిలినేని తన ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ద్వారా రిలీజ్‌ చేస్తున్నారు. ‘బేబి’, ‘గుంటూరు కారం’, ‘హనుమాన్‌’, ‘గామి’, ‘ఓం భీమ్‌ బుష్‌’, ‘టిల్లు స్క్వేర్‌’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాల డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ ఫుల్‌ జర్నీ చేస్తున్నారు ధీరజ్‌ మొగిలినేని. ఆయన తమ టీమ్‌లో జాయిన్‌ కావడాన్ని ‘భజే వాయు వేగం’ మేకర్స్‌ హ్యాపీగా అనౌన్స్‌ చేశారు. అలాగే ఈ సినిమా సాధించబోయే ఘనవిజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్‌, రాహుల్‌ టైసన్‌, తనికెళ్ల భరణి, రవిశంకర్‌, శరత్‌ లోహితస్వ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: మధు శ్రీనివాస్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, ఎడిటర్‌: సత్య జి, సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి రాజశేఖర్‌, మ్యూజిక్‌ (పాటలు) – రధన్‌, మ్యూజిక్‌ అండ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ – కపిల్‌ కుమార్‌, కొరియోగ్రఫీ – విశ్వ రఘు, కో ప్రొడ్యూసర్‌ – అజయ్ కుమార్‌ రాజు.పి, ప్రొడ్యూసర్‌: యూవీ కాన్సెప్ట్స్‌, దర్శకుడు: ప్రశాంత్‌ రెడ్డి చంద్రపు.

Spread the love